తమిళ రంగస్థలంలో ఆ హీరో ఫిక్స్ అయినట్టేనా?

మరిన్ని వార్తలు

రెండేళ్ల క్రితం 'రంగస్థలం' చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సహజంగా కమర్షియల్ గా విజయం సాధించిన చిత్రాలకు పెద్దగా ప్రశంసలు దక్కవు. విమర్శకుల ప్రశంసలు సాధించిన చిత్రాలకు కలెక్షన్లు ఉండవు. కానీ 'రంగస్థలం' మాత్రం ఆ రెండింటిని సాధించి ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. అటు దర్శకుడు సుకుమార్ కు ఇటు హీరో రామ్ చరణ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. 


ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 'రంగస్థలం' తమిళ రీమేక్ లో నటించేందుకు కు లారెన్స్ ఆసక్తి చూపిస్తున్నాడట. మరి ఈ సినిమాలో హీరోగా మాత్రమే నటిస్తాడా లేదా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియదు. ప్రస్తుతం రంగస్థలం రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం అయిందని సమాచారం. 


ఇక లారెన్స్ ఇతర సినిమాల విషయానికి వస్తే  లారెన్స్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం 'లక్ష్మీబాంబ్' త్వరలో ఓటీటీ ద్వారా డైరెక్ట్ గా విడుదల కానుంది. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ సూపర్ హిట్ 'ముని 2: కాంచన'  కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS