ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ లారెన్స్ మాస్టర్ అస్వస్థతకు గురైయినట్టు సమాచారం.
వివరాల్లోకి వెళితే, లారెన్స్ ఈ మధ్య మెడనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. అయితే నిన్న జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళ ప్రజలకి తనవంతు సహాయం అలాగే మద్దతు తెలపడానికి మేరిన బీచ్ కి వచ్చాడు.
అక్కడ వారితో కొద్దిసేపు గడిపాక మెడనొప్పి తీవ్రం అవ్వడంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. కాని ఆ నొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అధిక ఒత్తిడిలో అలాగే విశ్రాంతి లేకుండా పనిచేయడమే ఈ తీవ్రమైన మెడనోప్పికి కారణం అని తెలుస్తుంది.