గ్లామ్‌షాట్‌: రత్తాలూ.. ఏంటీ యాంగిలూ.!

By Inkmantra - January 28, 2020 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

రత్తాలుగా మెగాస్టార్‌ సరసన స్పెషల్‌ సాంగ్‌లో మెరిసి ఓ ఊపు ఊపేసిన మిల్కీ బ్యూటీ రాయ్‌ లక్ష్మికి అదృష్టం పట్టినట్లే పట్టి వదిలేసింది. ఇంకేముంది.. రత్తాలు తెచ్చిన ఇమేజ్‌తో రాయ్‌ లక్ష్మి దశ తిరిగిపోయిందని భావించారంతా. కానీ, ఆ దశ యూ టర్న్‌ తీసుకుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అయిపోయింది. కేవలం ఈ హాట్‌ హాట్‌ రత్తాలు అందాలు సోషల్‌ మీడియాకే పరిమితమైపోయాయి. సినిమాల్లో పెద్దగా రాణించడం లేదు కానీ, సోషల్‌ మీడియాని హీటెక్కించడంలో పాపం కష్టజీవిలా పోరాటం చేస్తూనే ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️❤️❤️

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

లేటెస్ట్‌గా రాయ్‌ లక్ష్మి ఓ బికినీ ఫోటో పోస్ట్‌ చేసింది. సెగలు బాగానే ఉన్నాయి. కానీ, ఎందుకో ఈ బికినీ రాయ్‌ లక్ష్మికి అంతగా సూటయినట్లు లేదంటూ విమర్శలు వస్తున్నాయి. సూట్‌ అయితే ఏంటీ.? లేకుంటే ఏంటీ.? కళాపోషకులకు కావాల్సిన టెంపరేచర్‌ అయితే ఈ బికినీ భామలో పుష్కలంగా దొరుకుతోంది. అయితే, ఆ టెంపరేచర్‌ తట్టుకోలేక ఫీవర్‌ బారిన పడితే మాత్రం తప్పు పాపది కాదండోయ్‌. ఇక పిక్‌ విషయానికి వస్తే, వైట్‌ అండ్‌ వైట్‌ బికినీలో బీచ్‌ ఒడ్డున ఓ కళాత్మకమైన హట్‌ కింద సేద తీరుతూ ఓ డిఫరెంట్‌ యాంగిల్‌లో ఫోటోకి పోజిచ్చింది. ఆ పోజు ఎలా ఉందో మీరే మీ భాషలో వర్ణించుకోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS