2004లో వచ్చిన 'జూలీ' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచనలం. బోల్డ్ కంటెన్ట్‌తో వచ్చిన ఆ సినిమా సెన్సేషనల్ విజయం అందుకుంది. నేహా ధూపియా అందానికి అంతా ఫిదా అయిపోయారు ఆ సినిమాలో. ఆమెకి ఓ స్థాయిలో పేరు తెచ్చి పెట్టింది ఆ సినిమా. నేహా ధూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జూలీ' సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌గా రాబోతున్న సినిమా 'జూలీ -2'. 2015లోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లింది. ఈ సినిమాలో అందాల తార లక్ష్మీరాయ్ హీరోయిన్గా నటిస్తోంది. నేహా ధూపియా తర్వాత ఆ స్థాయిలో గ్లామర్ లక్ష్మీరాయ్లోనే ఉందని ఆమెని వెతికి మరీ పట్టుకుని ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చింది బాలీవుడ్. బాలీవుడ్లో ఇదే లక్ష్మీరాయ్‌కి తొలి సినిమా. ఈ సినిమా కోసం బొద్దుగా ఉండే లక్ష్మీరాయ్ ఏకంగా 15 కేజీల బరువు తగ్గింది. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, విచ్చల విడి అందాల ప్రదర్శన ఒక ఎత్తు. మరో విషయం ఏంటంటే, లక్ష్మీరాయ్ 'జూలీ -2'లో వంద రకాల బికినీలు ధరించిందట. ఒక్క బికినీ వేస్తేనే ఆ సీన్ సినిమాకి హైలైట్ అవుతుంది. అలాంటిది వంద బికినీలంటే మాటలా? ఈ బికినీ సౌందర్యం కోసమే అమ్మడు సన్నగా నాజూగ్గా తయారయ్యిందట. అయితే ఈ వంద బికినీలు మన మెగా ఐటెం గాళ్ ఏ ఏ సందర్భాల్లో ధరించిందా? అంటూ ప్రేక్షకుల్లో ఆశక్తి నెలకొంది. ఇప్పటికే కొన్ని బికినీ ఫోటోలు సోషల్ లీకై హల్ చల్ చేస్తున్నాయి. దీపక్ శివ దాసాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాదే ఈ సినిమా విడుదల కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. త్వరలోనే విడుదల కానుంది.