రౌడీ సినిమా..200 కోట్లు చేస్తుందా?

By Gowthami - June 22, 2021 - 14:14 PM IST

మరిన్ని వార్తలు

పెద్ద సినిమాల‌పై ఓటీటీ క‌న్నేసింది. ఏదోలా... మంచి బేరానికి పెద్ద సినిమాల్ని కొనేయాల‌నుకుంటుంది. అందులో భాగంగానే.. `లైగ‌ర్‌`కి రూ.200 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు, ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల అవ్వ‌బోతున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. లైగ‌ర్ కి 200 కోట్లంటే చాలా పెద్ద ఆఫ‌రే. క‌చ్చితంగా ఈ డీల్ కి చిత్ర‌బృందం ఓకే చెబుతుంద‌నుకున్నారంతా. అయితే.. ఈ వార్త‌ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. `మా సినిమా థియేట‌ర్లో విడుద‌ల చేస్తే 200 కోట్ల‌కంటే ఎక్కువే వ‌సూలు చేస్తుంది` అనే అర్థంతో ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు అది వైర‌ల్ అవుతోంది.

 

పూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం `లైగ‌ర్‌`. పూరి నుంచి వ‌స్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాకి 200 కోట్ల బేర‌మంటే.. మంచి డీలే. విజయ్ సినిమా ఎంత హిట్ట‌యినా.. ఈ మాత్రం తెచ్చుకోదు. అలాంటిది... `మా సినిమా 200 కోట్ల కంటే ఎక్కువే చేస్తుంది` అని చెప్పుకోవ‌డం విజ‌య్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని.. టాలీవుడ్ జ‌నాలు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చిన మాట నిజ‌మే అని, కానీ అది 200 కోట్లు కాద‌ని, ఆ డీల్ న‌చ్చ‌క‌.. చిత్ర‌బృందం ఒప్పుకోలేద‌ని, మ‌రో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి లైగ‌ర్ కూడా థియేట‌రిక‌ల్ రిలీజ్ ని న‌మ్ముకుంది. ఈ సినిమా ఇప్పుడు థియేట‌ర్లో 200 కోట్ల‌కు మించి వ‌సూలు చేస్తుందా, లేదా? అనేదే చూడాలి. 200 కోట్ల‌కు ఏమాత్రం త‌క్కువైనా.. విజ‌య్ చేసిన ఇప్ప‌టి ట్వీట్ ని విప‌రీతంగా ట్రోల్ చేయ‌డానికి యాంటీ ఫ్యాన్స్ అంతా రెడీగా ఉంటారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS