ఈమధ్య మాధవీలత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటుంది. సినిమాలూ, రాజకీయాలు, సమాజ సేవ.. ఇలా ఎలా చూసినా, ఏదో ఓ టాపిక్కుతో సోషల్ మీడియా టచ్‌లోకి వస్తోంది. ఈ మధ్య పవన్ కల్యాణ్ పై కొన్ని సెటైర్లు వేసి, పవన్ ఫ్యాన్స్ దృష్టిలో పడింది మాధవి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో చాలా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు పవన్‌ని విష్ చేశారు.
పవన్ కూడా వాళ్లకు తిరిగి రిప్లైలు ఇచ్చుకుంటూ వెళ్లాడు. కానీ... కొంతమందికి రిప్లై ఇవ్వడం మర్చిపోయాడట. దాంతో.. మాధవీలత సెటైర్లు వేసింది. దాంతో మాధవిని కూల్ చేయడానికి ప్రయత్నించారు పవన్ ఫ్యాన్స్ `వదినా..` అంటూ సంబోధిస్తూ, సమాధానాలు ఇచ్చారు. దాంతో.. మాధవి ఆగ్రహానికి లోనైంది. `దయ చేసి నన్ను అలా పిలవొద్దు. పవన్ మీకు అన్న కావొచ్చు. నేను మాత్రం వదిననిని కాను. అక్కా అని పిలవండి` అని సీరియస్ అయ్యింది. పాపం.. పవన్ రిప్లై ఇవ్వకపోవడంతో బాగా హర్ట్ అయినట్టుంది.