నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో `భలే భలే మగాడివోయ్` ఒకటి. తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ చిత్రం.. భారీ లాభాల్ని మూటగట్టుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం.. విడుదలై నేటికి 5 ఏళ్లు. నాని క్యారెక్టరైజేషన్, మారుతి రాసిన సరదా సన్నివేశాలు, డైలాగులు, పాటలు.. ఇవన్నీ ఈ సినిమా సూపర్ కావడానికి దోహదం చేశాయి. మారుతిని మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో ఈ సినిమా చేర్చింది.
ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతోందని టాక్. ఈ కథని కొనసాగించాలని మారుతి భావిస్తున్నాడట. అయితే.. `మహానుభావుడు` క్యారెక్టరైజేషన్ ని సైతం - ఈ కథలో మిక్స్ చేయాలనుకుంటున్నాడట మారుతి. ``భలే భలే మగాడివోయ్, మహానుభావుడు రెండూ క్యారెక్టరైజేషన్ ఆధారంగా రాసుకున్న కథలు. ఆ క్యారెక్టర్లలో ఉన్న గమ్మత్తే ఆయా చిత్రాల విజయాలకు దోహదం చేశాయి. ఈ రెండు క్యారెక్టర్లూ ఒకే సినిమాలో కనిపిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఈ రెండు కథలకూ ఒకే సీక్వెల్ అవుతుంది`` అని చెప్పుకొచ్చాడు మారుతి. ఒక దర్శకుడు తీసిన రెండు సినిమాలకు ఒకే సీక్వెల్ తీయడం నిజంగా కొత్త విషయమే. మరి ఆసీక్వెల్ ఎప్పుడు వస్తుందో?