డైరెక్టర్ మారుతి అంటే ఠకీమని గుర్తొచ్చే సినిమా 'భలే భలే మగాడివోయ్'. ఈ సినిమాలో హీరోకి మతిమరుపు. మతిమరుపు క్యారెక్టర్‌లో హీరోని చూపించి, ఫుల్ ఫన్ జనరేట్ చేస్తూ, అక్కడక్కడా కొంచెం సెంటిమెంట్ యాడ్ చేసి, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ తనవైపు తిప్పుకున్నాడు మారుతి. ఇప్పుడు 'మహానుభావుడు' సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. 'భలే భలే మగాడివోయ్' సినిమా సక్సెస్‌తో ఏకంగా విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. కానీ స్టార్ హీరోతో మారుతి ఫార్ములీ ఆశించినంత విజయం అందివ్వలేదు. అందుకే మళ్లీ యంగ్ హీరోతో తనకు సక్సెస్ తెచ్చిన ఫార్ములాతోనే మళ్లీ రాబోతున్నాడు. ఈ సారి ఈ సినిమాలోని హీరోకి మరో వీక్‌నెస్ పెట్టాడు డైరెక్టర్. మతిమరుపు వీక్‌నెన్‌తో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన మారుతి, లేటెస్ట్ హీరోకి 'ఓసిడీ' అనే వీక్‌నెస్ పెట్టాడు. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపెల్సివ్ డిజార్డర్ అన్న మాట. ఈ సినిమాలో హీరో శర్వానంద్. శర్వానంద్ పాత్ర పేరు ఆనంద్ ఓసీడీ. ఈ డిజార్డర్‌తోనే మారుతి మళ్లీ నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్నాడు. శర్వానంద్ అసలే సక్సెస్ మీద సక్సెస్‌లు కొడుతూ జోరు మీదున్నాడు. మారుతి తనకి కలిసొచ్చిన ఫార్ములాతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా లక్కీ గాళ్ మెహరీన్ నటిస్తోంది. ఏ రకంగా చూసినా ఈ సినిమాకీ అన్నీ ప్లస్ పాయింట్సే కనిపిస్తున్నాయి. వీక్‌నెస్ పాయింట్‌ని పట్టుకుని డైరెక్టర్ మారుతి మరో సూపర్ సక్సెస్ కొట్టేస్తాడేమో చూడాలి. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.