ఈ రోజు హైద్రాబాద్‌లో 'మహర్షి' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ లాస్ట్ మినిట్‌లో అతిధులు మారిపోయారు. మూడు వారాల గ్యాప్ తర్వాత ఇటీవలే 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. దాంతో చరణ్, ఎన్టీఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న కారణంగా ఈ వేడుకకు రాలేకపోయారట. మరి అయితే 'మహర్షి' కోసం వస్తున్న ఆ అతిధులెవరో తెలుసా? మన పెద్దోడు విక్టరీ వెంకటేష్ త్వరలో 'కామ్రేడ్'గా రానున్న సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.
ఈ సందర్భంగా భారీ ఎత్తున్న అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశమున్నందున భారీగా ఏర్పాట్లు చేశారట. హైద్రాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా ఈ వేడుకకు వేదిక కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఓ వైపు నెగిటివిటీ ప్రచారంలో ఉన్నా, అంచనాలు మాత్రం ఆకాశాన్నే అంటుతున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా రానున్న మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ సంస్థతో కలిసి గ్రాండ్‌గా ఈ సినిమాని రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ మార్కెట్లో సందడి చేస్తోంది. మే 9న 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది.