మహేష్‌ చెప్పాడు, మారతారా మరి?

మరిన్ని వార్తలు

మేం మేం ఎప్పటికీ స్నేహితులం, మీరెందుకు మా గురించి కొట్టుకుంటారు? అని పలువురు హీరోలు తమ అభిమానులను ఉద్దేశించి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా అభిమానుల సెంటిమెంట్లు చల్లారడంలేదు. రికార్డులు, వసూళ్ళు పేరుతో ఓ హీరో అభిమానులపై ఇంకో హీరో అభిమానులు నోరు పారేసుకోవడం చూస్తున్నాం. కొట్లాటలు ముదిరి హత్యలు దాకా వెళుతున్నాయి. మహేష్‌ - పవన్‌ అభిమానుల మధ్య గొడవ ఓ హత్యకు దారి తీసింది గతంలో. ఓ సినిమాలో అభిమానుల పైత్యం గురించి ఆ చిత్ర దర్శకుడు నిర్మొహమాటంగా చెప్పాడు. అయినా అభిమానుల సెంటిమెంట్లు అంతే. లేటెస్ట్‌గా హీరో మహేష్‌, తన అభిమానుల్ని ఉద్దేశించి ఇతర హీరోలను వారి అభిమానుల్ని హర్ట్‌ అయ్యేలా వ్యవహరించొద్దని కోరాడు. సినిమా ఇండస్ట్రీలో తన ఫ్రెండ్స్‌ గురించి చెబుతూ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తన మనసు బాగా నచ్చిన ఫ్రెండ్‌ అని అన్నాడు. తమ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉందనీ, అభిమానులు మాత్రం గొడవ పడుతుంటారనీ, ఆ గొడవలు తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పాడు. ఏ హీరో అయినా తన అభిమానుల కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. హీరోని అభిమానించొచ్చు, ఆ అభిమానం ఇంకో హీరో మీద దురభిమానంగా మారకూడదు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ చెప్పినా, మెగాస్టార్‌ చిరంజీవి చెప్పినా, ఇంకో హీరో చెప్పినా కంటెంట్‌ ఒక్కటే, అభిమానులెవరూ కొట్టుకోవద్దని. వింటారా మరి?

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS