మహేష్ రాజమౌళి కాంబోలో మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ ప్రాజెక్ట్ పై హోప్స్ పెరిగిపోతున్నాయి. మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీని తరువాత జక్కన్న మూవీ కోసం మహేష్ సిద్ధం అయ్యాడు. కానీ ఇప్పటివరకు ఈ కాంబోపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దాదాపు 11 నెలలుగా ఖాళీగా ఉన్నాడు మహేష్. ఈ లోగా ఇంకో సినిమా ఒప్పుకున్నా అయిపోయి ఉండేది అని ఫాన్స్ బాధపడుతున్నారు.
టెక్నీషన్స్, నటీనటులు, గూర్చి కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది, రామోజీ ఫిలిం సిటీ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు అన్న వార్తలు వినిపించాయి. అంతే కాదు ఈ మూవీలో రానా విలన్ గా నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగుతోంది. ఇవన్నీ పుకార్లుగానే ఉన్నాయి తప్ప అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. జనవరిలో షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. ఈ క్రమంలోనే జక్కన్న లోకేషన్ వేటలో కెన్యా వెళ్లారని, స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసారాని అనుకున్నారంతా. కానీ ఈ మూవీ షెడ్యూల్ ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయింది.
మొదట 2024 డిసెంబర్లో షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని ప్రచారం జరిగింది, తరవాత జనవరికి వెళ్ళింది. ఇప్పుడు అది కూడా కాదని మార్చ్ అని వినిపిస్తోంది. ఇంకా జక్కన్న స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని, టెక్నికల్ విషయాలపై వర్క్ షాప్ నడుస్తుందని, నటీ నటుల ఎంపిక కూడా జరగలేదని, అందుకే మార్చ్ కి వెళ్ళింది షెడ్యూల్ అని టాక్. షూటింగ్ కి ఇంత టైం తీసుకుంటున్న జక్కన్న సినిమాకి ఇంకెంత టైం తీసుకుంటారో? అంటే మరో మూడేళ్ళ పాటు మహేష్ ని స్క్రీన్ పై చూడలేమా అని ఫాన్స్ వాపోతున్నారు. షెడ్యూల్ మారటం వలనే మహేష్ లుక్ కూడా చేంజ్ చేసి ఉంటారని ఫాన్స్ భావిస్తున్నారు.