మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సెట్టయ్యింది.!

By iQlikMovies - April 11, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

అవునండీ మీరు విన్నది నిజమే త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మహేష్‌ మూడోసారి నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదు. ఓ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌కి సంబంధించిన యాడ్‌ షూట్‌ జరుగుతోంది. ఈ యాడ్‌కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ వహించారు.

 

గతంలో ఐపీఎల్‌కి సంబంధించి త్రివిక్రమ్‌ ఇలాగే ఎన్టీఆర్‌తో ఓ యాడ్‌ షూట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్‌తో రూపొందించిన ఈ యాడ్‌ షూట్‌కి మంచి స్పందన వస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. స్వయానా మహేష్‌బాబు ఈ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, 'నా ఫేవరేట్‌తో మూడోసారి.. ఆయనతో కలిసి పని చేయడం నాకెప్పుడూ కొత్త అనుభూతినిస్తుంది..' అని ట్వీట్‌ చేశారు. మహేష్‌ నుండి ఏ చిన్న ట్వీట్‌ వచ్చినా వ్యూస్‌ పోటెత్తుతాయి. అలాగే ఈ ట్వీట్‌కీ వ్యూస్‌తో పాటు, కామెంట్లు కూడా వస్తున్నాయి. గతంలో మహేష్‌తో త్రివిక్రమ్‌ 'అతడు', ఖలేజా' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాలూ మహేష్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ కాంబోలో అలాంటి బ్లాక్‌ బస్టర్‌ కోసం మళ్లీ ఎదురు చూస్తున్నామంటూ మహేష్‌కి ట్వీట్‌ చేశారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం మహేష్‌బాబు 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించిన సెకండ్‌ ఆడియో సింగిల్‌ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

 

మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌తో సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నారు. ఈ నెల 24న ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS