మహేష్‌తో దిల్‌రాజు చేయబోయే మ్యాజిక్‌ ఏంటో!

By iQlikMovies - March 16, 2018 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో బిగ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, విక్టరీ వెంకటేష్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందింది. భారీ కాస్టింగ్‌, భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ నడుమ తెరకెక్కినది ఈ చిత్రం. 

అయితే దిల్‌ రాజు ఆ టైంలోనే మహేష్‌తో సోలోగా ఓ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఈ కాంబినేషన్‌ సెట్‌ కాలేదు. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్‌ వర్కవుట్‌ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజు స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. అతి త్వరలోనే ఆ డీటెయిల్స్‌ చెబుతాననీ దిల్‌రాజు అన్నారు. 

పల్లెటూరి ప్రేమ కథలను, కుటుంబ సంబంధాలను తెరపై సక్సెస్‌ఫుల్‌గా ఆవిష్కరించడంలో దిల్‌రాజుకు మంచి టేస్ట్‌ ఉంది. నిజానికి దిల్‌రాజు సినిమా అంటే ఫెయిల్యూర్‌కి ఆస్కారమే ఉండదు. అలాంటిది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా విషయంలో ఆ లెక్కలు ఎందుకో తిరకాసయ్యాయి. అయితేనేం మహేష్‌తో సినిమా చేసి, ఆ లెక్కలు సరి చేయాలని అనుకుంటున్నారట దిల్‌రాజు. 

ప్రస్తుతం దిల్‌రాజు రామ్‌తో 'హలో గురూ ప్రేమకోసమే..' చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. దిల్‌రాజు నిర్మాణంలో ముద్దుగుమ్మ అనుపమ నటిస్తున్న రెండో చిత్రమిది. గతేడాది ఈ కాంబినేషన్‌లో తొలి సినిమా 'శతమానం భవతి' సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS