'సరిలేరు నీకెవ్వరూ..' సినిమా రిలీజ్ తర్వాత సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీతో వెకేషన్‌కి బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్‌లో ఫ్యామిలీతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడే వారి వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది మహేష్‌బాబు సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రతా శిరోడ్కర్. పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ఫ్యామిలీ ఎంజాయ్‌మెంట్‌లో మునిగి తేలుతున్నారు సూపర్ స్టార్ మహేష్‌బాబు. మరోవైపు మహేష్ మోకాలికి ఏదో ఆపరేషన్ జరగనుందట.. అనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఆ విషయమై అధికారికంగా ఎక్కడా మహేష్ స్పందించింది లేదు. ఆ గాసిప్‌లో నిజమెంతో తెలీదు. ఇకపోతే, 'సరిలేరు..' బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. 'మహర్షి'తో మహేష్‌కి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ మరోసారి సూపర్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. అదిరిపోయే స్క్రిప్టు సిద్ధం చేసి ఉంచారు. వెకేషన్ ముగించుకుని ఇండియాకి తిరిగొచ్చేసరికి ఈ సినిమాకి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం వంశీ పైడిపల్లి మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా మహేష్ సరసన చిందేసే ముద్దుగుమ్మల వేటలో ఉన్నారనీ తెలుస్తోంది. బాలీవుడ్ నుండి ఇద్దరు ప్రముఖ తారల్ని మహేష్ కోసం రంగంలోకి దించే పనిలో ఉన్నారట వంశీ పైడిపల్లి.