మహేష్‌ కూల్‌గా కొల్లగొట్టాడు

మరిన్ని వార్తలు

ఇంతవరకూ వాణిజ్య ప్రకటనల్లో చాలా కంపెనీలకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేశాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. అయితే తాజాగా ఓ ఎసి కంపెనీకి మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన యాడ్‌లో మహేష్‌, తమిళ నటుడు ప్రేమ్‌జీతో కలిసి నటిస్తున్నారు. ఈ యాడ్‌ చాలా బాగుంది. మంచి రెస్పాన్స్‌ వస్తోంది ఈ యాడ్‌కి. తమిళంలో ప్రేమ్‌జీ పాపులారిటీ ఉన్న నటుడు. తనకు మహేష్‌తో ఈ యాడ్‌లో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అలాగే ఈ యాడ్‌లో మహేష్‌ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. ఇంతవరకూ మహేష్‌ చేసిన యాడ్స్‌ అన్నింట్లోకీ ఈ యాడ్‌ ప్రత్యేకంగా ఉంది. అంతకన్నా బాగుంది కూడా. ఈ హాట్‌ సమ్మర్‌లో కూల్‌ యాడ్‌తో మహేష్‌ తన ఫ్యాన్స్‌ని ఇంట్లోనే ఉండి కూల్‌ చేస్తున్నాడు ఈ యాడ్‌తో. మరో పక్క మురుగదాస్‌తో మహేష్‌ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాతో తొలిసారిగా మహేష్‌ తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఇదో బైలింగ్వల్‌ మూవీ. తమిళ నటులు చాలా మందే ఉన్నారు ఈ సినిమాలో. ముఖ్యంగా తమిళ డైరెక్టర్‌ ఎస్‌జె. సూర్య ఈ సినిమాలో మహేష్‌కి విలన్‌గా నటిస్తుండగా, మరో యంగ్‌ హీరో భరత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS