మహేష్ మేనల్లుడు వస్తున్నాడు

మరిన్ని వార్తలు

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అన్న ట్యాగ్ ఘట్టమనేని వారి సొంతం. తొలుత ఈ టైటిల్ కృష్ణకి దక్కింది ఆ తరువాత ఆయన కుమారుడు అయిన మహేష్ బాబుకి ఆ టైటిల్ సొంతం అయింది. 

ఇక ఈ కుటుంబం నుండి పలువురు నటనలోకి రాగ ఈ మధ్యనే కృష్ణ రెండవ కుమార్తె మంజుల డైరెక్షన్ లోకి కూడా అడుగుపెట్టింది. తాజాగా ఈ కుటుంబం నుండి ఒక యంగ్ హీరో రాబోతున్నట్టు సమాచారం. యంగ్ హీరోగా ఆరంగేట్రం చేయబోయేది ఎవరంటే మహేష్ అక్క పద్మావతి కుమారుడు అశోక్ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలయినట్టు సమాచారం.

 

తండ్రి MP గల్లా జయదేవ్ బాటలో కాకుండా తాతయ్య, మామయ్య దారిలో నడవడానికి అశోక్ సిద్ధపడ్డాట. అందుకే మహేష్ & కో ఇతనికి పూర్తీ సహకారం అందిస్తున్నారట. 

ఇక ఈ చిత్రానికి ఆర్.కే అనే యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు అని తెలుస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS