రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతోనే. ఇది ఎప్పుడో ఖరారైపోయింది. అయితే ఎలాంటి కథ? ఏ జోనర్? అనే విషయాలలో సందిగ్థత నెలకొంది. ఈ సినిమా జోనర్ పై రోజుకో గాసిప్ వినిపిస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచరస్ కథ అని అప్పుడెప్పుడో చెప్పారు. ఆ తరవాత జేమ్స్ బాండ్ తరహా సినిమా అని అన్నారు. ఇప్పుడు.. మరో గాసిప్ మొదలైంది. ఇది.. టైమ్ మిషన్‌కి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఈసినిమా ఆదిత్య 369 తరహాలో సాగుతుందని, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన కథ అని సమాచారం అందుతోంది. అటు మహేష్ గానీ, ఇటు రాజమౌళి గానీ, ఈ తరహా కథ ఇప్పటి వరకూ చేయలేదు. కాబట్టి కొత్తగానే ఉంటుంది.
కాకపోతే... ప్రభాస్ కథానాయకుడిగా `ప్రాజెక్ట్ కె` అనే సినిమా తయారవుతోంది. ఇది కూడా టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. హీరో భూత, భవిష్యత్ కాలాలలోకి ప్రయాణం చేస్తుంటాడని.. ఆ కాలాల్లో ఏం జరిగిందన్నది ఆసక్తికరమైన పాయింట్ అని తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ తో పాటు మహేష్ కూడా అలాంటి కథనే ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇవి రెండూ ఇంచు మించుగా ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకోవడం, విడుదల కావడం.. మరో విశేషం. ప్రభాస్ సినిమా అయితే... టైమ్ మిషన్ కథ నేపథ్యంలో సాగడం పక్కా. మరి మహేష్‌దీ అదే కథైతే.. ఈ రెండింటి మధ్యా పోటీ మొదలవ్వడం ఖాయం.