మహేష్‌బాబు అందాన్ని మ్యాచ్ చేయాలంటే ఆయన పక్కనున్న అందమైన భామలు సైతం పోటీ పడాల్సిందే. ఎంతో కష్టపడాల్సిందే. ఎంత కష్టపడినా ఆయన అందాన్ని మ్యాచ్ చేయడం సాధ్యం కాని పనే. లేటెస్ట్‌గా 'మహర్షి' నుండి వదిలిన లుక్ అదిరిపోయింది.
'పదరా.. పదరా..' సాంగ్‌కి సంబంధించిన లుక్ ఇది. లుక్‌లో ఎడ్లబండి, నాగలి పట్టి పొలం దున్నుతోన్న మహేష్ కనిపిస్తున్నాడు. ప్యాంటు షర్టు వేసుకుని, ప్యాంటు పైకి మడతెట్టి, తలపాగా చుట్టి, అలా మహేష్ పొలం దున్నుతుంటే, ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారంతే. మొన్న విడుదలైన 'సమస్తం..' సాంగ్‌లో సూట్ వేసుకుని స్టైల్‌గా హెలికాప్టర్ నుండి దిగినా, స్టైల్ స్టైల్‌గా ఫైళ్లు తిరగేసినా, చేతిలో ల్యాప్‌టాప్‌తో కాలేజీ కుర్రాడిలా అమ్మాయిలకు సైట్ కొట్టినా, ఇప్పుడు నాగలి పట్టి పొలం దున్నినా ఏం చేసినా, ఏ లుక్ అయినా మహేష్‌కి సాటి ఎవరు చెప్పండి. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. 'మహర్షి' సినిమాపై ఎన్నెన్ని నెగిటివ్ రూమర్స్ వస్తున్నా, ఒక్కొక్కటిగా విడుదలవుతోన్న లుక్స్‌తో అనూహ్యంగా సినిమాపై హైప్ క్రియేట్ అయిపోతోంది. రేపు సాయంత్రం 4 గంటలకు 'పదరా పదరా.. ఆడియో సింగిల్ రానుంది.
ఈ లిరికల్ సాంగ్‌తో ఇంకెన్ని మెస్మరైజింగ్ స్టిల్స్ రిలీజ్ అవుతాయో చూడాలిక. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' తెరకెక్కింది. దిల్ రాజు, అశ్వనీ దత్ నిర్మాతలు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.