మహేష్ - రాజమౌళి కాంబో మూవీ మొదలయ్యింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరన్నది క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. సైలెంట్ గా పూజా కార్య క్రమాలు నిర్వహించి, షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసాడు. అయితే ఈ సినిమాకోసం జక్కన్న చాలా పకడ్బంధీగా ప్లాన్ చేసాడట. అందుకే ఎలాంటి అప్డేట్ బయటికి చెప్పటం లేదు. ప్రియాంక మెయిన్ హీరోయిన్ కాదని, ఇంకో హీరోయిన్ కూడా ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. మహేష్ తో పాటు ఇంకో తెలుగు హీరో కూడా SSMB29 లో కనిపిస్తాడని టాక్.
SSMB29 లో ఒక కీలక పాత్ర ఉండగా దాని కోసం హాలీవుడ్, బాలీవుడ్ హీరోలెందుకు తెలుగు హీరో అయితే బెటరని ఆలోచనలో ఉన్నారట జక్కన్న. ఇవన్నీ పక్కన పెడితే మొన్న మహేష్ పాస్ పోర్ట్ తీసుకుని బోన్ లో బంధించినట్లు హింట్ ఇచ్చిన రాజమౌళి ఇప్పడు మహేష్ ఫోన్ కూడా తీసుకున్నారని టాక్. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా సినిమా విషయాలు లీక్ అవకుండా చాలా కేర్ తీసుకుంటున్నారని ఈ క్రమంలోనే ఫోన్లు కూడా తీసుకున్నారని ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
సెట్ లోకి ఎవరూ ఫోన్ తీసుకు రాకూడదని అల్టిమేటం జారీచేశారట. ఈ లిస్ట్ లో మహేష్, ప్రియాంకా చోప్రా కూడా ఉన్నారని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాకి వర్క్ చేస్తున్న వారి దగ్గరనుంచి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నారట. ఎవరైనా సినిమా న్యూస్ కానీ కంటెంట్ కానీ లీక్ చేస్తే వారి పై వేటు, చర్యలు రెండూ తప్పవు. ఈ సినిమా పూర్తి అయ్యేలోగా ఇంకేం చేయిస్తాడో మహేష్ తో రాజమౌళి. అసలు వర్క్ షాప్ అంటేనే తెలియని మహేష్ ని కూడా వర్క్ షాప్ లో పాల్గొనేలా చేసాడు జక్కన్న.