మహేష్‌ 'కమర్షియల్‌' ఫ్యామిలీ ప్యాక్‌ చూశారా?

మరిన్ని వార్తలు

కమర్షియల్‌ యాడ్స్‌లో టాప్‌ లెవల్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుదే. 'అభి' బస్‌ యాడ్‌ కావచ్చు.. థమ్స్అప్‌ యాడ్‌ కావచ్చు.. ల్లాయిడ్‌ ఏసీలు కావచ్చు.. ఏ ప్రొడక్ట్‌ అయినా తీసుకోండి, ఆ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేయడంలో ముందుంటారు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు. అయితే, మహేష్‌ ఈ సారి ఇంకొంచెం కొత్తగా కమర్షియల్‌ యాడ్‌లో నటించాడు. వివరాల్లోకి వెళితే, ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకి సంబంధించి లేటెస్ట్‌గా ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించారు మహేష్‌బాబు. అయితే, ఈ సారి సింగిల్‌గా రాలేదు. ఏకంగా ఫ్యామిలీనే ప్యాకేజీగా పట్టుకొచ్చేశాడు.

 

రియల్‌ ఎస్టేట్‌ యాడ్‌ అంటే, ఇంత రియలిస్టిక్‌గా ఉండాలా.. ఇంత రిచ్‌నెస్‌తో మెరిసిపోవాలా.. అనేంతలా డిజైన్‌ చేశారు ఆ యాడ్‌ని. మహేష్‌తో పాటు, ఆయన భార్య నమ్రతా శిరోడ్కర్‌, కొడుకు గౌతమ్‌, కూతురు సితారలు ఈ యాడ్‌లో గ్రాండ్‌గా మెరిశారు. తండ్రీ కొడుకులు సూట్స్‌ ధరించి చాలా రిచ్‌గా కనిపిస్తున్నారు. ఈ యాడ్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిజంగానే ఆ యాడ్‌కి మహేష్‌ ఫ్యామిలీ చాలా అందాన్ని తీసుకొచ్చింది.

ఇకపోతే, పర్సనల్‌ ఇష్యూస్‌ని షేర్‌ చేసుకోవడంలోనూ, ఫ్యామిలీని ప్రొజెక్ట్‌ చేయడంలోనూ మహేష్‌ ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటికప్పుడే కూతురు సితారకు సంబంధించిన సరదా ముచ్చట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. అయితే, తొలిసారి ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం ఫ్యామిలీని తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS