సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తుంది.
అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ తో పాటుగా హిందీలోను రిలీజ్ చేస్తారన్న విషయం మనకు విదితమే. అయితే 400-500 వరకు స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే యోచనలో పంపిణి హక్కులను పొందిన రిలయన్స్ సంస్థ ఉన్నట్టు తెలుస్తుంది.
మహేష్ కి అలాగే డైరెక్టర్ మురుగదాస్ కి కూడా బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా ఈ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకొనే దానిలో భాగంగానే ఈ రేంజ్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారట.
చూద్దాం.. రిలయన్స్ ప్లాన్ ఫలించి మహేష్ రేంజ్ బాలీవుడ్ ని కూడా తాకుతుందా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.