రాజమౌళి అందరికీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన పెట్టారు. ఆయన సినిమాలతో పోలిక పెట్టుకోవడానికీ కూడా ఎవరూ సాహసించడం లేదు. ఆయన సినిమా లెక్కల్ని అందుకోలేక నాన్ ఎఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అనే కొత్త పదం ట్రేడ్ కనిపెట్టింది. అయితే మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా.. రాజమౌళి సినిమాల నెంబర్లకు దగ్గరగా వెళుతుందని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు.
‘‘#SSMB28 అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నానంటే.. ఇది విడుదలైన ప్రతిచోటబ్లాక్ బస్టర్ అవుతుంది. రాజమౌళి గారి సినిమా నంబర్స్‌కు దగ్గరగా వెళ్తుంది. మేము ‘అల వైకుంఠపురములో’ సినిమా అప్పుడు కూడా రాజమౌళి నంబర్స్ దాకా వెళ్లాం. ఇక మహేశ్ - త్రివిక్రమ్‌ల సినిమా మా అంచనాలను చేరుకుంటుందని ఆశిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు వంశీ.