మహేష్ చేసిన టక్కరిదొంగ గురించి ఒక ఆసక్తికర విషయం ఇన్నిరోజులకి బయటపడింది. అది కూడా డైరెక్టర్ జయంత్ బయటపెట్టాడు.
అదేంటంటే- జయంత్ దర్శకుడు గానే కాకుండా నిర్మాతగా మారి టక్కరిదొంగ చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాదించకపోవడంతో మహేష్ ఆ చిత్రానికి ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదట.
కొన్ని రోజుల తరువాత జయంత రెమ్యునరేషన్ ప్రస్తావన తీసుకువచ్చిన కూడా ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరించాడట. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తనకి అండగా నిలబడిన మహేష్ ని తాను ఎప్పుడు మరిచిపోను అని చెప్పాడు.