మహేష్ 25వ చిత్రం ఆగిపోనుందా?

By iQlikMovies - June 18, 2018 - 15:16 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం గురించిన వివరాలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ఆ సినిమాకి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకి ఈ రోజే డెహ్రాడూన్ లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది, దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి.

అయితే షూటింగ్ మొదలై ఒక్క రోజైనా కాలేదు అంతలోనే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడేలా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు తో ఈ చిత్రాన్ని PVP సంస్థ నిర్మించాల్సి ఉన్నా అది తరువాత కాలంలో దిల్ రాజు-అశ్వినీదత్ లకి ఈ అవకాశం దక్కడం వంటి వివరాలు తెలిసినవే. ఇదే విషయమై PVP సంస్థ వారు కోర్టులో కేసు వేసి తద్వారా 15 మంది యూనిట్ సభ్యులకి లీగల్ నోటిసులు పంపించారు. 

ఇక ఆ కోర్టు నోటిసులకి సమాధానం చెప్పకుండా షూటింగ్ మొదలుపెట్టడంతో మరోసారి PVPవారు సదరు కోర్టుని ఆశ్రయించారు. దీనితో మహేష్ తో సహా మరో 14 మందికి కోర్టు ధిక్కార నోటిసులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ పరిణామంతో సినిమా షూటింగ్ ఆగిపోయే ప్రమాదంలో పడింది. 

ఈ విషయమై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS