పంచెకట్టుతో వచ్చి హౌస్‌లో అప్పుడప్పుడూ తన పంచ్‌లతో ఆకట్టుకున్న రాయలసీమ కుర్రోడు మహేష్‌కి బిగ్‌బాస్‌తో రుణం తీరిపోయిందా? అంటే, అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో పునర్నవి, రాహుల్, వరుణ్, మహేష్లున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో ఇది చాలా టఫ్ ఎలిమినేషన్ అనిపించింది. అయితే, సివరాఖరికి మహేష్ పైనే వేటు పడింది.
ఎలిమినేషన్స్ అనంతరం హౌస్‌లో చోటు చేసుకున్న పరిణామాల రీత్యా మహేష్‌పై చాలా నెగిటివిటీ జనరేట్ అయ్యింది. పుల్లలు పెడుతున్నాడు.. అని హోస్ట్ నాగార్జున ఇచ్చిన బిరుదుకు అనుకూలంగా మసలుకోవడం, అది వీక్షకుల్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం దగ్గర నుండీ, లేటెస్ట్గా జరిగిన 'బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్' టాస్క్‌లో బాబా భాస్కర్‌కి అనుకూలంగా మాట్లాడుతున్న రాహుల్‌ని గిల్లి, అనవసరంగా వివాదం లేపడం వరకూ మహేష్ తన బుద్ధిని బయట పెట్టుకుంటూనే వున్నాడు.
దాంతో మహేష్‌లో జన్యూనిటీ మిస్ అయ్యిందనే ఫీలింగ్‌కి వచ్చేశారు ఆడియన్స్. సో హౌస్‌లో ఉండేందుకు మహేష్ అర్హుడు కాదంటూ ఆయనకు తక్కువ ఓట్లు వేయడంతో ఈ వారం మహేష్ ఇంటి నుండి బయటికి రాక తప్పడం లేదట.. అయితే, ఇది కేవలం ప్రచారం మాత్రమే. నిజమేంటో తెలియాలంటే, ఏలాగూ వీకెండ్ వచ్చేసింది. ఎలిమినేషన్ డేకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.