అడివి శేష్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ మూడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా మంచి రివ్యూలు వచ్చాయి. అందరూ సినిమాని క్లాసిక్ అని మెచ్చుకున్నారు. సినిమా చూసిన జనాలు ఎమోషనల్ అయ్యారు. ఐతే అది తెలుగు వెర్షన్ వరకే పరిమితమైయింది.
పాన్ ఇండియా సినిమా ఇది. 26/11 హీరో కథ. అంటే దేశ వ్యాప్తంగా రెస్పాన్స్ వుండాలి. సినిమా బావుంది. చాలా గొప్పగా తీశారు కూడా. ఐతే బాలీవుడ్ నుండి ఈ సినిమాకి సరైన రెస్పాన్స్ లేదు. అక్కడ బాక్సాఫీసు కూడా వీక్ గా వుంది. ప్రమోషన్స్ బాగానే చేశారు. హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కూడా కలిశారు. అయినప్పటికీ నార్త్ నుండి రావాల్సిన స్పందన రావడం లేదు. ఇక విడుదుల తర్వాత మేజర్ టీమ్ కూడా తెలుగుపైనే ద్రుష్టి పెట్టింది. నిన్న హైదరాబద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు విజయవాడ టూర్ చేస్తున్నారు. పాన్ ఇండియా రెస్పాన్స్ మాట పక్కన పెడితే ముందు తెలుగు పై ఫోకస్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మేజర్ యూనిట్ లో వున్నట్లు కనిపిస్తుంది.