మలైకా అరోరాకి డ్యాన్స్ తో ఫిట్ నెస్, యోగాపై కూడా మంచి పట్టుండి. ఓ వైపు నటిగా ఉంటూనే మరోవైపు యోగా ట్రైనర్‌గా బిజీగా ఉంటుంది మలైకా. ఇప్పుడు తనలో రచయితను అందరికీ పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది మలైకా. నటిగా, డ్యాన్సర్, యోగా ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్న మలైకా ఇక రచయితగా కూడా కొన్ని ఉపయోగకరమైన అంశాలతో ఓ పుస్తకం రాసేందుకు సిద్దమవుతున్నది. పోషకాహారం పై ఈ పుస్తకం ఉండబోతుంది.
పుస్తకం గురించి మలైకా మాట్లాడుతూ..ఆరోగ్యం కు సంబంధించిన ఆలోచనలను సులభతరం చేయడమే నా లక్ష్యం. పుస్తకం రాయడం వల్ల నాలోని భావాలను ఎక్కువ మంది పంచుకునే అవకాశం కలుగుతుంది. శారీరక ఆరోగ్యం బావుంటేనే మానసికంగా బావుంటామని నేను నమ్ముతాను. కాబట్టి శారీరక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలనేది నా భావన’ అని వెల్లడించింది మలైకా. గబ్బర్ సినిమాలో కెవ్వు కేక పాట ద్వారా మలైకా తెలుగు ప్రేక్షకులకు పరిచయం.