వయసు 44 హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌

మరిన్ని వార్తలు

ఈ ఫోటోలో ధగధగ మెరిసిపోతోన్న ఈ గోల్డెన్‌ బ్యూటీ మలైకా అరోరా. వయసు నలభై నాలుగు. కానీ ఆమె అందం చూశారా? అదరహో అనిపిస్తోంది. స్వీట్‌ సిక్స్‌టీన్స్‌లో ఉన్న భామలా మెరిసిపోతోంది. తెలుగులో 'గబ్బర్‌ సింగ్‌' సినిమాలో 'కెవ్వుకేక' అంటూ డాన్సులేసి, కుర్రకారునే కాదు, ముసలోళ్లకీ మూడ్‌ తెప్పించేసింది ఈ ముద్దుగుమ్మ. వయసు పెరిగినా ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో మెరిసిపోతోంది. హై హీల్స్‌ వేసుకుని, గోల్డెన్‌ డ్రస్సులో అమ్మడి అందాలు కెవ్వుకేక అంటే చిన్న మాటే. అంతకు మించి అనేంతలా ఉంది ఆమె అందం. వయసు మనసుకి కాదని చెప్పే మలైకా నిర్మాతగా, ఐటమ్‌ భామగా, కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టే గృహిణిగా ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. 44 ఏళ్ళ వయసులోనూ ఐటమ్‌ సాంగ్స్‌కి తాను రెడీ అని చెప్పడం మలైకాకే చెల్లుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS