గ్లామ్‌షాట్‌: సెక్సీ హాట్‌ 'మాస్టర్‌' పీస్‌.!

మరిన్ని వార్తలు

ఎవరీ సెక్సీ రెడ్‌ హాట్‌ మాస్టర్‌ పీస్‌ అనుకుంటున్నారా.? పేరు మాళవికా మోహనన్‌. ఇంకా పరిచయం కాని పేరే ఇది. అయితే, గతంలో ఈ పేరును ఎక్కడో విన్నట్లుందే.. అనుకుంటున్నారా.? అవును నిజమే.. విన్నాం. ఎక్కడా.? అంటారా.? సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో 'హీరో' సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. అయితే, ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో, ఆ ప్రాజెక్ట్‌ అలా ఆగిపోయింది. కానీ, ఇప్పుడు తమిళంలో స్టార్‌ హీరో విజయ్‌ సినిమాలో నటిస్తోంది మాళవిక. అంతే కాదు, సూర్య తాజా చిత్రంలోనూ నటించనుందనే గుసగుస కూడా ఉంది. సినిమాల్లో పరిచయ ఉపోద్ఘాతం ఇలా ఉంటే, పాపకి సోషల్‌ మీడియాలో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్‌ ఉందండోయ్‌. మరి ఉండదా.. ఏంటి.! ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటే, ఎక్కడెక్కిడినుండో ఫాలోవర్లు ఎగేసుకుని మరీ వచ్చేస్తుంటారు.

చూస్తున్నారుగా ఈ భారీ అందాల మాళవికను. హాట్‌ హాట్‌గా క్లీవేజ్‌ షో చేస్తూ కుర్రకారును పిచ్చెక్కించేస్తోందంతే. ఆమె క్లీవేజ్‌ అందాల దాడి ముందు మెడలో ధరించిన వజ్రాల నెక్లస్‌ అందం చిన్నబోతోందంటే అతిశయోక్తి కాదేమో. అయితే, ఇంత ఫాలోయింగ్‌ పెట్టుకుని పాపకి ఇంతవరకూ సరైన సినిమా ఛాన్సులు రాలేదెందుకో మరి. సరె సర్లే ఎన్నో అనుకుంటుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటీ.? ఎట్టకేలకు దొరికిన ఛాన్స్‌ అయినా, ఇళయదళపతి విజయ్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అది చాలదూ.. దున్నేయడానికి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS