సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాలోయింగ్ మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉందని అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఒక దేశ ప్రధాన మంత్రి రజిని ఇంటికి స్వయంగా వచ్చి కలవడమంటే మన తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఒక పరాకాష్ట అని చెప్పుకోవచ్చు.
మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ చెన్నై లోని రజిని ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. దీనికి కారణం రజిని చిత్రం కబాలి ఎక్కువగా మలేషియాలోనే షూటింగ్ జరుపుకోవడం.
ఏదేమైనా ఒక ప్రధాని వచ్చి కలవడమనేది బహుశా ఇదే ప్రధమం కావొచ్చు..