మనసులో ఏమి ఉంటే బయటకి అది చెప్పే మనస్తత్వం ఉన్న అతికొద్దిమంది హీరోలలో మంచు మనోజ్ ఒకరు.
ఇక ఆయన చిత్రాలనే కాకుండా భయట హీరోల చిత్రాలు ఏవైనా నచ్చితే వెంటనే తన స్పందన తెలియచేస్తుంటాడు. ఇదే కోవలో రామ్ చరణ్ రంగస్థలం చిత్రానికి సంబందించిన పాటలు తాను వినడం జరిగింది అని అవి తనని వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ చిత్రం కోసం పాటల కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తూన్నట్టు తన ట్విట్టర్ లో అందరితో పంచుకున్నాడు. ఇదే సమయంలో ఒక వ్యక్తి రామ్ చరణ్ గురించి ఒక్క మాట ఏదైనా చెప్పమంటే- రామ్ చరణ్ ఓ ‘బంగారం’ అని చెప్పి తమ మధ్య ఉన్న స్నేహాన్ని గురించి ఒక్కమాటలో చెప్పేశాడు.
ఇది చూసైనా ఫ్యాన్స్ గొడవలు పడకుండా ఉంటారు అని ఆశిద్దాం..