డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న మనోజ్

మరిన్ని వార్తలు

మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యక్తిగత కారణాల వలన ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ సినీ కెరియర్ కూడా డౌన్ అయ్యింది. కొన్నాళ్లుగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్న మనోజ్ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఈ మధ్యనే ఒక పాప కూడా పుట్టింది. సినిమా జర్నీ కూడా కొత్తగా మొదలు పెట్టాడు. మంచు ఫాన్స్ మనోజ్ మళ్ళీ అన్నిటిలో ఇలా సెటిల్ అవటం పట్ల సంతోషంగా ఉన్నారు. 


సెకండ్ ఇన్నింగ్స్ లో మనోజ్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. 'ఉస్తాద్' అనే టాక్ షో తో హోస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అయ్యాడు . ఇప్పుడు వెండి తెరపై మెరవటమే ఉంది. సిల్వర్ స్క్రీన్ పై హీరో గా కాకుండా, విలన్ గా దర్శన మివ్వబోతున్నాడు. హనుమాన్ సినిమాతో   సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తేజా సజ్జ హీరో గా  'మిరాయ్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మనోజ్ సూపర్ పవర్స్ ఉన్న విలన్ గా నటిస్తున్నాడు. మనోజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా మెప్పించింది. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుందని పలువురు కితాబు ఇచ్చారు.  కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మనోజ్ నటన వేరే లెవెల్ లో ఉంటుందని టాక్.                      


ఈ మూవీ కాకుండా అనిల్ రావి పూడి వెంకీ కాంబోలో వస్తున్న మూవీలో కూడా మనోజ్ నటిస్తున్నట్లు సమాచారం.  F2 , F3 లో వెంకీ , వరుణ్ తేజ్ లు కలిసి నటించారు. ఇప్పుడు వెంకీ, మనోజ్ తో అనిల్ రావిపూడి సినిమా అంటే అందరిలో ఆసక్తి నెలకొంది. ఎలాంటి కథ అయి ఉంటుంది. ఈ సినిమాలో మనోజ్ సెకండ్ హీరోనా లేదా  విలన్ గా నటిస్తున్నాడా అని సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి మనోజ్ కెరియర్ పై ద్రుష్టి పెట్టి , డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS