ట్రోలర్స్‌కి మంచు ఫ్యామిలీ అంటే ఎంతిష్టమో..? ఎందుకంటే.. మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ మంచు.. వీళ్లలో ఎవరు మీడియా ముందుకొచ్చినా - మీమ్స్, ట్రోల్స్‌కి బోలెడంత కంటెంట్ ఇచ్చి వెళ్తారు. దాంతో బోల్డంత కామెడీ సృష్టించుకొంటారు.
నిన్న.. ఆదివారం పూట.. `జిన్నా` ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు మోహన్‌బాబు కూడా వచ్చారు. చాలా రోజుల తరవాత మంచు ఫ్యామిలీలో జరిగిన సినిమా వేడుక ఇది. దాంతో.. బోలెడంత కామెడీ పండుతుందని అంతా భావించారు. మీమర్స్, ట్రోలర్స్.. ఈ వేడుక కోసం కళ్లు కాయలు కాచుకొని ఎదురు చూశారు. కానీ... ఎప్పటిలా కాకుండా, ఈ ఈవెంట్ కాస్త చప్పగా సాగిపోయింది. రెగ్యులర్ గా మోహన్ బాబు, విష్ణులు మాట్లాడే `ఎగస్ట్రా`లు ఎక్కడా కనిపించలేదు. విష్ణు సెటిల్డ్ గా మాట్లాడాడు. `మీరు కూడా చాలా తక్కువగా మాట్లాడండి డాడీ` అంటూ... మోహన్ బాబుకి ముందే హింట్ ఇచ్చాడు విష్ఱు. అందుకే ఆయన కూడా సినిమా గురించి తప్ప ఏం మాట్లాడలేదు. దాంతో.. మీమర్స్ , ట్రోలర్స్ కి పని లేకుండా పోయింది. తాము ఏం మాట్టాడినా జనాలు కామెడీగా తీసుకొంటున్నారన్న విషయాన్ని మంచు కుటుంబం గ్రహించి ఉంటుంది. అందుకే ఇక కామెడీ చేయకుండా సెటిల్డ్ గా ఉండాలని భావిస్తోందేమో..? అందుకే `జిన్నా` షోలో ఎక్కడా హంగామా కనిపించకుండా పోయింది.
చాలా కాలం తరవాత విష్ణు హీరోగా నటించిన సినిమా ఇది. దీనిపై విష్ణు చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఈ సినిమా విష్ణుకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని చిత్రబృందం చెబుతోంది. అవునా? కాదా? అనేది ఈనెల 21తో తేలిపోతుంది.