మంచు విష్ణు సినిమా తరువాత సినిమా చేస్తూ తన కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. తన కొత్త చిత్రం లక్కున్నోడు ఎలుండి రిలీజ్ అవుతుంటే అప్పుడే ఇంకొక సినిమాకి తను బరువు పెరిగే నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, విష్ణు ఒక బైలింగ్వల్ సినిమా చేయబోతున్నాడు ఇది ఏకకాలంలో తమిళ-తెలుగు బాషలలో రూపొందనుంది. అందుతున్న సమాచారం ప్రకారం, విష్ణు ఈ సినిమా కోసం 15కిలోల బరువు పెరగన్నునాడట. కధలో వచ్చే ఒక కీలక యాక్షన్ సన్నివేశం కోసం ఫిట్ బాడీ లుక్ లో విష్ణు కనిపించబోతున్నాడట.