విలక్షణ నటుడు మోహన్‌బాబు హీరోగా నటించిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఆయన కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో 'అసెంబ్లీ రౌడీ' ఒకటి. అయితే ఇప్పుడీ సినిమా చర్చ ఎందుకంటారా? అసలు వివరాల్లోకి వెళితే, మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా 'ఓటర్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేస్తారనుకున్నారు కానీ, టెక్నికల్ రీజన్స్ కారణంగా సినిమా విడుదల లేటయ్యింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా రిలీజ్ లేట్ కావడానికి ఇంకో కారణముందంటూ ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన 'ఓటర్'ని మోహన్‌బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' స్క్రీన్‌ప్లే తరహాలో రూపొందించాలని అనుకున్నారట. కానీ , దర్శకుడు తాను రాసుకున్న కథనే తెరకెక్కించాడట. సినిమా పూర్తయ్యాక స్క్రీన్‌ప్లే విషయంలో తలెత్తిన వివాదాలే ఈ సినిమా రిలీజ్ లేటయ్యేందుకు కారణమని తాజాగా గాసిప్ ఒకటి బయటికి వచ్చింది.
విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డికి ఈ వివాదంతో ప్రమేయముందని అంటున్నారు. అయితే, డైరెక్టర్‌కీ విజయ్‌కుమార్ రెడ్డికీ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయిందనీ అంటున్నారు. ఇదిలా ఉంటే, ఏపీలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎటువంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్‌నీ విడుదల కానివ్వడం లేదు. అది కూడా 'ఓటర్' పోస్ట్‌పోన్‌కి కారణం కావచ్చు. అయితే, ఈ వివాదాల్లో ఏది నిజమన్నది మాత్రం అధికారికంగా క్లారిటీ లేదు. కానీ, మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం న్యూయార్క్‌లో తన భార్య వెరోనికాతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మళ్లీ తండ్రి కాబోతున్నారన్న విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపారు. ఆల్రెడీ మంచు విష్ణుకు అరియానా, వివియానా, అవ్రామ్ భక్త అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే.