మంచు విష్ణు, మనోజ్ ట్విట్టర్ వార్

మరిన్ని వార్తలు

మంచు మెహన్ బాబు ఫ్యామిలీ వివాదాలు కొత్త ఏడాది లో కూడా ముగిసినట్టు కనిపించటం లేదు. ముందు హైద్రాబాద్ జల్ పల్లిలో ఈ వివాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ పై దాడి చేయటంతో కేసు ఫైల్ అయ్యింది. అరెస్ట్ భయంతో మోహన్ బాబు  విదేశాలకి పారిపోవటంతో ఈ వివాదాలు కొంచెం సద్దుమణిగాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన మోహన్ బాబుకి అక్కడ చుక్కెదురయ్యింది. దీంతో సుప్రీం లో పిటిషన్ వేశారు. కొంచెం ఊరట లభించటంతో ప్రస్తుతం మోహన్ బాబు తన సొంత ఊరిలో ఉన్నారు. ఈ క్రమంలో మనోజ్ మళ్ళీ మోహన్ బాబు ఉన్న ఊరికి వెళ్ళటంతో గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చంద్రగిరిలో మనోజ్, భార్య మౌనిక పై కేసులు నమోదు అయ్యాయి. మోహన్ బాబు పీఏ పై కూడా మనోజ్ కేసు ఫైల్ చేసాడు.

ఇప్పడు మనోజ్, విష్ణు సోషల్ మీడియా వేదికగా ఒకరి పై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఒకర్ని ఒకరు 'కుక్క' తో పోల్చుకుని వార్ మొదలుపెట్టారు. విష్ణు మొదట X వేదికగా తన తండ్రి నటించిన 'రౌడీ' సినిమాలోని 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుందని, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ' అన్న డైలాగ్‌ను పోస్ట్ చేసాడు. ఈ డైలాగ్ తనకు చాలా ఇష్టమని  కామెంట్ చేశాడు.

వెంటనే విష్ణుకి కౌంటర్‌ గా మనోజ్ కూడా ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 'కన్నప్పలో రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్‌ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు' అని పోస్ట్ చేసాడు. ప్రస్తుతం విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమాని ఉద్దేశించి మనోజ్ డైరెక్ట్ గా ఈ పోస్ట్ పెట్టాడు. ఇంకా క్లియర్ గా అర్థం అవాలని ఈ పోస్ట్ కింద విస్మిత్, హాలీవుడ్ వెంచర్ అని క్లూ కూడా ఇచ్చాడు. ఇది చాలదు అన్నట్లు మోహన్ బాబు నటించిన ఒక సినిమాలోని క్లిప్ ను కూడా  ఇంకో పోస్ట్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో మోహన్ బాబు తన ఆస్తిని ఇవ్వాలని విలన్స్ తో గొడవపడతాడు. ఇన్ డైరక్టుగా అది తన పాత్ర అని అర్థం వచ్చేలా ఉంది మనోజ్ పోస్ట్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS