మణిరత్నం కలల చిత్రం `పొన్నియన్ సెల్వన్` విడుదలకు సిద్ధమైంది. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం మణిరత్నం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రచారం కూడా ఓ లెవిల్ లో చేస్తున్నారు. తెలుగులో అంత హైప్ రాలేదు కానీ, తమిళనాట ఈ చిత్రానికి క్రేజ్ మామూలుగా లేదు. అక్కడ అడ్వాన్సుబుకింగులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎప్పుడూ లేనిది మణిరత్నం కూడా మీడియాతో బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో మణి చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాని మణిరత్నం గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చారు. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి తమిళ వెర్షర్ లాంటిదని అన్నారు. దాంతో ఈ పోలిక ఎందుకు తీసుకు రావాల్సివచ్చిందా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్ ఓ నవల ఆధారంగా పొందించిన చిత్రం. 10 వ శతాబ్దంలో ఛోళ సామ్రాజ్యం చుట్టూ అల్లిన కథ. ఇది రియల్ స్టోరీ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలా కాదు. అదో ఫాంటసీ ప్రపంచం. నిన్నా మొన్నటి వరకూ దేశ చరిత్రని సినిమాగా తీస్తున్నానని చెప్పిన మణిరత్నం సడన్ గా మాట మార్చి.... గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చడం కొంతమందికి రుచించడం లేదు. ఇదంతా పబ్లిసిటీ స్టంటా..? లేదంటే నిజంగానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఇండియన్ వెర్షన్‌లాంటి సినిమానా? అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలంతే.