మ‌ణిర‌త్నం సినిమాకి ఇన్ని క‌ష్టాలా?

మరిన్ని వార్తలు

మ‌ణిర‌త్నం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు. క్లాసిక్స్ తీశాడు. ఇందులో డౌటు లేదు. కానీ కొన్నేళ్లుగా హిట్ అనే ప‌దాన్నే విన‌లేక‌పోయాడు మ‌ణి. త‌న నుంచి వ‌చ్చిన‌వ‌న్నీ డిజాస్ట‌ర్లే. ఇక మ‌ణిర‌త్నం టైమ్ అయిపోయింది అనుకొంటున్న ద‌శ‌లో.. పొన్నియ‌న్ సెల్వ‌న్ వ‌చ్చింది. మ‌ణిర‌త్నాన్ని నిల‌బెట్టింది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు సాధించింద‌ని చిత్ర బృంద‌మే స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా వ‌స్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాతో మ‌ణి క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌ట‌కు వ‌చ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని త‌మిళంలో మిన‌హాయిస్తే ఎక్క‌డా మార్కెట్ జ‌ర‌గ‌లేదు. అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాని కొనే బ‌య్య‌ర్లే క‌రువ‌య్యారు.

 

పొన్నియ‌న్ సెల్వ‌న్ హిట్టే. కాక‌పోతే.. త‌మిళ వాసులే ఈ సినిమాని ఓన్ చేసుకొన్నారు. తెలుగులో రూ.10 కోట్ల‌కు ఈ సినిమా కొన్నారు. ఆ డ‌బ్బులు బొటాబొటీగా, చాలా క‌ష్ట‌ప‌డి వెన‌క్కి వ‌చ్చాయి. చాలా చోట్ల బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి. త‌మిళ వాసులు ఈ సినిమాని సెంటిమెంట్ గా భావించారు. త‌మ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు నిలువుట‌ద్దం అనుకొన్నారు. వాళ్లు ఈ సినిమాని నెత్తిమీద పెట్టుకొన్నా మిగిలిన వాళ్ల‌కు ఎక్క‌లేదు. ఆ క‌థేంటో, పాత్రేమిటో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. అందుకే పార్ట్ 1 అంతంత మాత్రంగానే చూశారు. అలాంట‌ప్పుడు పార్ట్ 2కి ఆద‌ర‌ణ ఎలా ఉంటుంది..? అందుకే ఈ సినిమాని కొన‌డానికి బ‌య్య‌ర్లు సిద్ధంగా లేరు. మ‌ణిర‌త్నం లాంటి ద‌ర్శ‌కుడు ఓ హిట్టు కొట్టాక కూడా ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ సినిమా గ‌ట్టెక్కాలంటే త‌మిళ‌నాట కనీసం రూ.150 కోట్ల‌యినా తెచ్చుకోవాలి. మ‌రి అది సాధ్య‌మేనా అనేదే పెద్ద ప్ర‌శ్న‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS