బాలకృష్ణ - పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఓ ఫైట్ సీన్ చిత్రీకరణ ఇప్పటికే జరిగిందట కూడా. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారట. వారిలో ఒకరి కోసం శ్రియని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రియ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో బాలయ్యకి జోడీగా నటించింది. ఈ జంట చూడ ముచ్చటగా ఉందంటూ రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'చెన్న కేశవరెడ్డి' సినిమాలో నటించారు. పదేళ్ల తర్వాత మళ్లీ 'శాతకర్ణి'తో మెప్పించారు. తాజాగా పూరీ జగన్నాధ్ మళ్లీ ఈ సినిమా కోసం శ్రియని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క యంగ్ హీరోయిన్ మనారా చోప్రా ప్లేస్ ఆల్రెడీ సెట్ అయిపోయిందంటున్నారు. 'రోగ్' సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ, మనారా యాక్టింగ్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అమ్మడికి ఈ సినిమాతో చాలా మంది ఫాలోవర్స్ తయారయిపోయారట కూడా. అందుకే ఈ సినిమా కోసం ఈ హాట్ అండ్ క్యూట్ బ్యూటీని పూరీ ఎంచుకున్నాడని సినీ ప్రముఖులు అంటున్నారు. గతంలో సునీల్‌తో 'జక్కన్న' సినిమాలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఇంత త్వరగా ఈ ముద్దుగుమ్మకి బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చిందంటే గొప్ప విషయమే. అందుకే ఈ భామ ఆనందానికి అవధుల్లేవు.