మంచు మనోజ్ హీరోగా నటించిన 'గుంటూరోడు' సినిమా ఆడియో విడుదల వేడుక పోస్ట్‌పోన్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమిస్తుండడంతో ఆ ఉద్యమానికి తాను మద్దతిస్తున్నట్లు మనోజ్ ప్రకటించాడు. ఇందులో భాగంగానే జనవరి 26న విడుదల కావాల్సి ఉన్న 'గుంటూరోడు' ఆడియో విడుదల వేడుక వాయిదా వేశారు. అదే రోజున విశాఖపట్నంలో యువత భారీ నిరసన కార్యక్రమాన్ని ప్రత్యేక హోదా కోసం చేపట్టనుంది. సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతిస్తూ, 'గుంటూరోడు' ఆడియో విడుదల వేడుక పోస్ట్ పోన్ అయినట్లు వెల్లడించాడు మనోజ్. ఈ సినిమాలో మనోజ్ సరసన 'కంచె' ఫేం ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ మాస్ లుక్‌తో ఆకట్టుకోనున్నాడు. యాక్షన్ సీన్స్ బీభత్సంగా తెరకెక్కించారట ఈ సినిమాలో. మామూలుగా తన సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ని మనోజ్ సొంతంగా కంపోజ్ చేసుకుంటాడు. అందుకే అవి తెరపై అంతగా వర్కవుట్ అవుతాయి. అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని ఫైట్లు తన కంపోజేషన్‌లో చేసినవి ఉన్నాయట. మాస్ మసాలా యాక్షన్‌తో పాటు రొమాంటిక్ లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.