హాట్ నెస్ తో హీరోయిన్స్ కి షాక్ ఇస్తున్న స్టార్ హీరో భార్య..!

By iQlikMovies - July 11, 2018 - 16:13 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్ రాక్ స్టార్ సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ తన భర్త జైలులో ఉన్నప్పుడు అన్నితానై చూసుకుంటూ తన ఇద్దరు కవలలని కంటికిరెప్పలా కాపాడుకుంది. ఇక ఇప్పుడు తన జీవితం ఇలా సాఫీగా సాగిపోతున్నది అంటే దానికి కారణం మాన్యతానే అని సంజయ్ చెప్పడం కూడా చాలాసార్లే చూసాము.

ఇక ఇదంతా నాణానికి ఒకవైపే.. మరోవైపు తను ఒక నటి, 40 ఏళ్ళకి దగ్గరవుతున్నా కూడా తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటూ ఇప్పటికి కూడా తన అందాన్ని ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా శ్రద్ధ తీసుకుంటున్నది. దీనికి సాక్ష్యమే ఆమె ఈ మధ్యనే తన విదేశీ యాత్రలో దిగిన ఫోటోలు ఆమె అందాన్ని అందరికి మరోసారి పరిచయం చేసేలా చేశాయి.

తన కుటుంబంతో సహా విహారయాత్రకి వెళ్ళిన ఆమె అక్కడి హోటల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఆ నీటిలో ఆమె ఒక జలకన్యలా ఉందంటూ కొందరంటుంటే మరికొందరు మాత్రం ఆమె అందాలకి ఎవరైనా దాసోహం అనాల్సిందే అంటూ ఆమెని పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ఇది ఇలా తన అందంతో అందరికి మతులుపోగోడుతున్నది ఈ స్టార్ హీరో భార్య...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS