అప్పుడు మతిమరుపు... ఇప్పుడు ఓసీడీ

మరిన్ని వార్తలు

హీరో పాత్రకి మతిమరుపుని జొప్పించి అతనితోనే కడుప్పుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు మారుతీ. భలే భలే మగాడివోయ్ చిత్రం తన కెరీర్ లోనే ఒక పెద్ద మలుపు అని చెప్పొచ్చు.

ఇక తన తాజా చిత్రం అయిన మహానుభావుడు చిత్రంలో హీరోకి ఓసీడీ ని పెట్టడంతో మరోసారి ఒక ఇంటరెస్టింగ్ కంటెంట్ తో ప్రజల ముందుకి రానున్నాడు. ఇక ఒకప్పుడు హీరోలు అంటే ఏరకమైన బలహీనతలు లేని వాడు అనే ప్రక్రియ నుండి బలహానీతలు ఉన్న వాళ్ళలో కూడా ఒక హీరో ఉంటాడు అన్న ట్రెండ్ లో భాగంగా వస్తున్న సినిమాల్లో ఈ సినిమా చేరిపోయింది.

మహానుభావుడు టీజర్ విషయానికి వస్తే, హీరో శర్వానంద్-హీరోయిన్ మేహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీని మాత్రం మనకి చూపెట్టిన ఏకైక సీన్ లో చాలా బాగా చూపించగలిగాడు.

మొత్తానికి... మహానుభావుడు టీజర్ తో ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ మాత్రం దర్శకుడు సృష్టించగలిగాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS