ఒకప్పుడు హీరోయిన్స్ గా రిటైర్ అయిన 10-15 యేండ్లకి మళ్ళీ తల్లి పాత్రల్లో నటించేవారు, కాని ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్స్ గా మార్కెట్ తగ్గిన 5-8 యేండ్లకే యంగ్ హీరోస్ కి తల్లి పాత్రలకి ఇప్పటితరం హీరోయిన్స్ ఒకే చెప్పేస్తున్నారు.
ఉదాహరణకి నదియా, రాశి, రమ్యకృష్ణ ఇప్పుడు అదే జాబితాలో మీనా కూడా చేరనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ కలయికలో రానున్న చిత్రంలో హీరోకి తల్లి పాత్రలో మీనా కనపడనుంది అని టాక్.
అధికారికంగా ఈ విషయం బయటకి రానప్పట్టికి మీనా ఈ చిత్రంలోనటిస్తుండడం పక్కా అని సమాచారం. చూద్దాం.. యంగ్ హీరోస్ కి తల్లిగా మీనా కెరీర్ ఎంతవరకు వెళ్ళనుందో..