DJ ఆఫీస్ పైన మెగా అభిమానుల దాడి?!

మరిన్ని వార్తలు

మెగా అభిమానులకి అల్లు అర్జున్ కి మధ్య రోజురోజుకి దూరం పెరుగుతూనే ఉంది.

తాజాగా హైదరాబాద్ లోని DJ చిత్ర ఆఫీస్ పైన మెగా అభిమానులు దాడికి దిగడం చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే, DJ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ చిరంజీవి ఖైదీ నెం 150 కన్నా ఎక్కువ అని ప్రకటించడంతో కొత్త వివాదానికి తెరలేపినట్టయింది.

అయితే గొడవ చేస్తున్న అభిమానులతో నిర్మాత దిల్ రాజు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ కలెక్షన్స్ ఏ ఆధారంగా వచ్చాయో తమకు వివరించాలి అని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

దిల్ రాజు & కో మాత్రం, తాము చెప్పినవి ఒరిజినల్ కలెక్షన్స్ అని, తమకి అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు అని తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS