తొలి రోజు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఒక మిలియన్ మార్క్‌ని దాటేసింది మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా. ఈ రకంగా ఇది మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో తొమ్మిదేళ్ళ తర్వాత చేరిన సరికొత్త రికార్డ్. ఇంకోవైపున తెలుగు రాష్ట్రాల్లో 'ఖైదీ నెంబర్ 150' సినిమా తొలి రోజు రికార్డుల్ని కైవసం చేసుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేయడం జరుగుతోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లు 'ఖైదీ' ఖాతాలో చేరతాయని సమాచారమ్. ఇంత భారీ వసూళ్ళకు ఓ కారణం కూడా లేకపోలేదు. అదేమిటంటే తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లలో 'ఖైదీ' ప్రదర్శితమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అన్ని థియేటర్లలోనూ 'ఖైదీ' సినిమానే ప్రదర్శిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని విశేషంగా దీన్ని చెప్పుకుంటున్నారు. నిన్న అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోలు ప్రారంభమవడంతో ఈ రోజు ఉదయానికే సినిమా టాక్ పాజిటివ్ అని స్ప్రెడ్ అయ్యింది. దాంతో ఇంకా ఉత్సాహంగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. దాదాపుగా సోమవారం వరకు 'ఖైదీ' ప్రదర్శితమవుతున్న థియేటర్లలో టిక్కెట్లకు ఛాన్స్ లేకుండా పోయింది. అడ్వాన్స్ బుకింగ్‌తో అన్ని టిక్కెట్లూ దాదాపుగా బుక్ అయిపోయాయి. కాబట్టి తొలి రోజు రికార్డులే కాకుండా తొలి వారం రికార్డులు కూడా 'ఖైదీ' ఖాతాలో పడనున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చును.