'కోతికొమ్మ‌చ్చి`.. క్రేజీ ఆఫ‌ర్‌!

మరిన్ని వార్తలు

సిని‌మా మొద‌లుపెట్ట‌క‌ముందే.. మంచి బిజినెస్ ఆఫ‌ర్ రావ‌డం, అందులోనూ చిన్న సినిమాకి అంటే మామూలు విష‌యం కాదు. స‌తీష్ వేగ్నేశ త‌న కొత్త సినిమా `కోతికొమ్మ‌చ్చి`కి ఇటీవ‌లే కొబ్బ‌రి కాయ కొట్టాడు. ర‌చ‌యిత‌గా సతీష్ చేతిలో మంచి విజ‌యాలున్నాయి. `శ‌త‌మానం భ‌వ‌తి`తో దర్శ‌కుడిగానూ త‌నేంటో నిరూపించుకున్నాడు. ఆ సినిమాతో జాతీయ అవార్డూ ద‌క్కింది. అందుకే స‌తీష్ కొత్త సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే ఆఫ‌ర్లు అందుకుంటోంది. శ్రీ‌హ‌రి త‌న‌యుడు మేఘాంశ్ శ్రీ‌హ‌రి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. స‌తీష్ వేగేశ్న త‌న‌యుడు శ్యామ్ మ‌రో హీరో.

 

ద‌స‌రా సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లో అమ‌లాపురంలో ఓ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ క‌థ గురించి దిల్ రాజుకి బాగా తెలుసు. నిజానికి ఆయ‌న‌కు ఎప్పుడో ఈ క‌థ వినిపించాడు స‌తీష్‌. కానీ వేరే బ్యాన‌ర్ కి వెళ్లింది. అందుకే ఈ సినిమా అవుట్ రేట్ కి కొన‌డానికి దిల్ రాజు ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు టాక్‌. శాటిలైట్, ఓటీటీల రూపంలోలో ఈ సినిమాకి అప్పుడే బేరాలు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. `కోతి కొమ్మ‌చ్చి` టైటిల్ అంత‌లా ప‌ట్టేసింది మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS