‘నీ కోసం ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నానురా మెహబూబ్..’ అంటూ టఫ్ టాస్క్ అయితే ఎంచుకున్నాడుగానీ, పూర్తి చేయలేక చేతులెత్తేశాడు సోహెల్. కానీ, అబిజీత్ అలాంటి పబ్లిసిటీ స్టంట్లు చెయ్యకుండా, తనకు వచ్చిన టాస్క్‌ని పూర్తి చేశాడు. ‘అబిజీత్.. నువ్వు 100 పర్సంట్ ఇస్తే సరిపోదు, 200 పర్సంట్ ఇవ్వాలి.. టాస్క్‌లు అదరగొట్టెయ్.. డాన్సులు చెయ్..’ అని హౌస్‌ని వీడి వెళుతూ మెహబూబ్ చెప్పిన మాటని అబిజీత్ గౌరవించాడు. అంతకు ముందెప్పుడూ లేని విధంగా కాస్తో కూస్తో డాన్సులేస్తున్నాడు. టాస్క్‌ల్లోనూ సత్తా చాటాడు.
హౌస్‌లో, మెహబూబ్ ఎలిమినేషన్ సందర్భంగా చాలా ఎమోషన్స్ నడిచాయి. వీటిల్లో అబిజీత్, హారికలది రియల్ అనీ, మిగతాదంతా ఫేక్ అనీ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, హౌస్‌లో అసలేం జరుగుతోంది, మనకేం చూపిస్తున్నారు? అన్నదానిపై సీజన్ వన్ నుంచీ భిన్న వాదనలున్నాయి. ‘జరిగేదొకటి, చూపించేది ఇంకొకటి..’ అనే విమర్శ ఎప్పటినుంచో వుందనుకోండి.. అది వేరే సంగతి.
ఈ సారి మిగతా సీజన్లకు భిన్నంగా అంతా డ్రమెటిక్ మోడ్‌లోనే జరుగుతోంది. చివరి వరకు ఎవరు బరిలో వుంటారు? అన్నదానిపై ఎవరి వాదన వారిదే. టైటిల్ ఎవరిదో ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందని కొందరంటున్నారు. ఇంకొందరేమో, ఏ రోజుకి ఆ రోజు బిగ్‌బాస్ ఈక్వేషన్స్‌ని మార్చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.