'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మెహరీన్ కౌర్. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా, తన అందంతో, నటనతో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందీ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం మెహరీన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కౌంట్‌కి ఎక్కువ, హిట్‌కి తక్కువ అన్నట్లు అయిపోయింది.గతేడాది వరుసపెట్టి 5 సినిమాలతో సందడి చేసిన ఈ బ్యూటీ డైరీలో సరైన హిట్ అంటూ ఏమీ లేదు. శర్వా లిస్టులో 'మహానుభావుడు' సినిమా ఒక్కటే ఈ ముద్దుగుమ్మకి హిట్ అని చెప్పొచ్చు.
అలా అని అవకాశాలు కూడా ఏమీ తగ్గడం లేదు ఈ ముద్దుగుమ్మకి. అయితే ప్రాధాన్యత లేని అవకాశం ఉంటే మాత్రం ఏం లాభం? అదేం జరుగుతోంది మెహరీన్ విషయంలో. హీరోయిన్‌గా తన పాత్రకి ప్రాధాన్యతే ఉండడం లేదు. ఏదో గ్లామర్ కోసం తప్ప. తాజాగా ఈ బ్యూటీకి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా పేరే 'నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)'. ఇదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఈ సినిమాలో సహజంగానే హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కి అంతగా ప్రాధాన్యత ఉండదు.
అలాగే 'నోటా'లో మెహరీన్ పాత్రకు కూడా అస్సలు ప్రాధాన్యత ఉండదట. గతంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'కేరాఫ్ సూర్య' సినిమాలో సినిమా విడుదలైన తర్వాత నిడివి ఎక్కువైన నేపధ్యంలో, హీరోయిన్ అయిన మెహరీన్ పాత్ర తాలూకు సన్నివేశాలను తొలిగించిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా మెహరీన్‌కి ఇది చాలా అవమానకరమైన పరిస్థితి. అలాంటిది ప్రాధాన్యత పెద్దగా లేదని తెలిసినా మెహరీన్ ఈ సినిమాకి ఎందుకు సైన్ చేసిందో తెలియడం లేదు మరి. చూడాలి అసలు ఈ సినిమాలో మెహరీన్ పాత్ర ఏపాటిదో!