ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ గతేడాది అంతా వరుస సినిమాలతో ప్రేక్షకులకు అత్యంత దగ్గరగా మెరిసింది. 2017లో 'మహానుభావుడు'తో మొదలైన ఈ అందాల భామ ప్రయాణం 'జవాన్'దాకా సాగింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్‌తో ఒక పక్క, విడుదలైన సినిమాలతో మరో పక్క సూపర్ బిజీగా గడిపేసింది. దాంతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్‌నెస్‌తో దుమ్ము దులిపేసింది. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యిందట ఈ భామ. ఈ గ్యాప్‌లో తన ఫిజిక్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేసిందట. ఫిజిక్‌ని అందంగా మలచుకుంటోందట. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేయించుకుంటోందట కూడా. దాంతో తన షేప్స్‌లో వచ్చే మార్పుల్ని అభిమానులకి ఎక్స్‌పోజ్ చేయడం కోసం ఎప్పటికప్పుడే ఫ్రెష్ ఫోటోస్‌తో కిక్కెక్కిస్తోందీ బ్యూటీ. తాజాగా దిగిన ఈ ఫోటో చూశారా? జవాన్ సినిమాలో తేజూ బంగారూ అంటూ పాట అందుకోవడం సంగతేమో గానీ ఈ బ్యూటీ 'సొగసు నిజంగానే బంగారం అనిపిస్తోంది. లేత గులాబీ రంగు ఫ్రాక్‌లో క్లీవేజ్ అందాలతో బంగారు మేని ఛాయతో చూపు తిప్పుకోకుండా చేస్తోందీ ముద్దుగుమ్మ అందం. ప్రస్తుతం ఈ అందాల సుందరి గోపీచంద్‌తో 'పంతం' సినిమాలో నటిస్తోంది.