స్లిమ్‌ అయ్యింది ఛాన్సులు కొట్టేస్తోంది

మరిన్ని వార్తలు

'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ మెహరీన్‌ కౌర్‌. తొలి సినిమా విజయంతో ఈ బ్యూటీ వరుస ఆఫర్లు దక్కించుకుంటుందని భావించారంతా. అయితే ఆ మాట ఓ సంవత్సరం తర్వాత నిజమైంది. సంవత్సరం పాటు మెహరీన్‌ నుండి సినిమాలేమీ రాకపోయినా, ఆ తర్వాతి ఏడాది మాత్రం ఏడాదంతా తానే అన్నట్లుగా వరుస సినిమాలతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఆ ఏడాదే 2017. ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మెహరీన్‌. వీటిలో హిట్స్‌ ఎన్ని? ఫట్స్‌ ఎన్ని అనే లెక్క పక్కన పెడితే, వరుస సినిమాలు చేతిలో ఉండడంతో ఫిజిక్‌పై సరిగ్గా కాన్‌సన్‌ట్రేషన్‌ చేయలేకపోయింది.

దాంతో క్యూట్‌ బ్యూటీ అనే ట్యాగ్‌ లైన్‌ నుండి బొద్దు బ్యూటీ ట్యాగ్‌లైన్‌కి మారిపోయింది. ఆ బొద్దుతనం కూడా మరింత ఎబ్బెట్టుగా మారడంతో, ఆ తర్వాత రావాల్సిన అవకాశాలు కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బొద్దుగుమ్మకి. దాంతో సినిమాలకు మళ్లీ కాస్త బ్రేకిచ్చి పూర్తిగా ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. దాంతో కొద్ది రోజుల్లోనే స్లిమ్‌గా ఇదివరకటి కంటే బ్యూటిఫుల్‌గా మారిపోయింది. తాను స్లిమ్‌ అయ్యానంటూ సోషల్‌ మీడియా వేదికగా సెల్ఫ్‌ పబ్లిసిటీ చేసుకుంది. దాంతో ఆఫర్లు మళ్లీ క్యూ కట్టాయి మెహరీన్‌కి.

అందులో భాగంగా సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది మెహరీన్‌. ఈ సినిమా ఈ రోజే లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. ఈ సంగతిటుంచింతే, ప్రస్తుతం గోపీచంద్‌తో 'పంతం' సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయట. వాటిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో ఓ సినిమా ఉన్నట్లు సమాచారమ్‌. తేజుతో మెహరీన్‌ ఆల్రెడీ 'జవాన్‌' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS